News April 16, 2025
వేసవి సెలవులు.. జనగామ జిల్లాలో టూరిజం ప్లేసెస్ ఇవే

వేసవిలో చాలా మంది టూర్ వెళ్దామనే ఆలోచనతో ఉంటారు. కానీ, కొంతమంది దూర ప్రదేశాలు కాకుండా దగ్గరలో ఒకే రోజులో వెళ్లి వచ్చే వాటిని ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే జనగామలో కొన్ని టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. పాలకుర్తి సోమేశ్వర ఆలయం, చీటకోడూరు డ్యాం, బొమ్మెర పోతన స్మారక స్థలం, జీడికల్ రాముల వారి టెంపుల్, వల్మిడి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం లాంటి కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.
Similar News
News April 16, 2025
MBNR: రైల్వే శాఖ అధికారులతో ఎంపీ సమీక్ష

క్యాంపు కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులు, ROB, RUB నిర్మాణం పురోగతిపై ఆమె సమీక్షించారు. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయడం ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని డీకే అరుణ అధికారులకు సూచించారు. తమ దృష్టికి వచ్చిన రైల్వే సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని అధికారులు ఎంపీకి చెప్పారు.
News April 16, 2025
MBNR: అధికారులు ఎందుకు పరామర్శించలేదు: మాజీ మంత్రి

ఇటీవల దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సమీపంలో ఉన్న క్వారీలో నీటిలో మునిగిపోయి మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబీకులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు పరామర్శించారు. ముగ్గురు చనిపోతే కనీసం కలెక్టర్, ఎస్పీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలని ఆదుకోవాలన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
News April 16, 2025
ADB: విద్యార్థులపై విష ప్రయోగం.. ఒకరి అరెస్టు: SP

ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై <<16115277>>విషప్రయోగం<<>> చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగుమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.