News May 14, 2024

వేసవీ రద్దీ దృష్ట్యా విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ ప్రత్యేక రైలు

image

ఏపీలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వచ్చి తిరిగి వెళ్లే వారి సౌకర్యార్ధం రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(08589/08590) మధ్య ఈ నెల 14, 15 తేదీలలో నడుస్తుందని తెలిపారు. 14వ తేదీ సాయంత్రం 4.15గంటలకు విశాఖలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 6.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మరల 15వ తేదీ ఉదయం 10.30గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 11.30కు విశాఖ చేరుతుంది.

Similar News

News November 5, 2024

VZM: సింగిల్ విండో ద్వారా రాజకీయ పార్టీలకు అనుమతులు

image

విజయనగరం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు మంజూరు చేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ వెల్లడించారు. ఈ సింగిల్ విండో సెల్‌కు నోడల్ అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎల్.జోసెఫ్ వ్యవహరిస్తారని, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల నిర్వహణకు అనుమతులు ఆయనే ఇస్తారని చెప్పారు.

News November 5, 2024

VZM: టెట్ టాపర్లకు కలెక్టర్ అభినందనలు

image

టెట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రాష్ట్ర‌స్థాయిలో మొద‌టి, రెండ‌వ ర్యాంకులను సాధించిన విద్యార్థినుల‌ను విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ అభినందించారు. టెట్‌లో జిల్లాకు చెందిన కోండ్రు అశ్వ‌ని 150/150 మార్కులను, దాస‌రి ధ‌న‌ల‌క్ష్మి 149.99 మార్కుల‌ను సాధించి రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌ధ‌మ‌, ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే 149.56 మార్కుల‌ను సాధించిన‌ దేవ హారికకు అభినందనలు తెలిపారు.

News November 5, 2024

TET RESULTS: మన విజయనగరం అమ్మాయికి 150/150 మార్కులు

image

టెట్‌ ఫలితాల్లో విజయనగరం అమ్మాయి కొండ్రు అశ్విని ఎస్జీటీ(పేపర్1-ఏ)లో 150కి 150 మార్కులు సాధించి ఏపీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆటో డ్రైవర్ అయిన శంకర్రావు, తల్లి వెంకటలక్ష్మి ఆమె సాధించిన మార్కుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి టీచర్‌గా మారి పిల్లలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది. వీటి అగ్రహారానికి చెందిన ధనలక్ష్మి 149.99/150, చీపురుపల్లికి చెందిన హారిక 149.46/150 మార్కులు సాధించారు.