News December 12, 2025

వే2న్యూస్ రీల్ రిపోర్టర్: ₹15,000కు పైగా సంపాదించే అవకాశం

image

Way2News ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా రీల్ రిపోర్టర్ల కోసం చూస్తోంది. మీకు కావలసిందల్లా ప్యాషన్ మరియు ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే. న్యూస్ & ఇన్ఫర్మేటివ్ వీడియో రీల్స్ క్రియేట్ చేయండి. మీ కంటెంట్‌కి తగ్గట్టు ప్రతి నెల ₹15,000కు పైగా సంపాదించవచ్చు. రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్‌‌లో ఎవరైనా జాయిన్ కావచ్చు. వివరాలకు <>reelreporter.way2news.com<<>> కు వెళ్ళండి.

Similar News

News December 12, 2025

2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

image

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.

News December 12, 2025

చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

image

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్‌ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.

News December 12, 2025

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది LLM1, 3 MSc బయో కెమిస్ట్రీ, MSc జియోలజీ, M.Com (FM / A&F) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదలయ్యాయి. www.results.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.