News March 5, 2026
వే2 న్యూస్ కథనానికి స్పందన..తీరిన దివ్యాంగుడి పెన్షన్ టెన్షన్

పొందూరు(M) బొట్లపేట వాసి నవీన్ 100% దివ్యాంగుడు. గతంలో వచ్చిన పింఛన్ నిలిచిపోయింది. అచేతనంగా కదలలేని స్థితిలోనున్న నవీన్‌ను భుజంపై మోసుకొని తల్లిదండ్రులు అధికారులు, కార్యాలయాల చుట్టు తిరిగినా సమస్య తీరలేదు. దీనిపై Way2Newsలో OCT22, 2025న ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’ అనే శీర్షికతో కథనం వచ్చింది. అనంతరం వచ్చిన వార్తలకు MLA కూన స్పందించి ఉన్నతాధికారులకు నివేదికివ్వగా పింఛన్ మంజారైంది.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్లైన్లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.