News February 5, 2025

వైఎస్ జగన్‌ను కలిసిన ఆలూరు ఎమ్మెల్యే.. ఈరన్న హత్యపై చర్చ

image

వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మంగళవారం కలిశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కలిసి మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గం అరికేర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్న హత్యపై చర్చించారు. ఈ ఘటనపై జగన్‌ స్పందిస్తూ.. కురువ ఈరన్న కుటుంబానికి పార్టీ నుంచి సహాయం అందిస్తామని తెలిపారు. త్వరలో అరికేరలో పర్యటిస్తారని పేర్కొన్నారు.

Similar News

News February 17, 2026

GHMC: మజ్లిస్ ‘కోట’.. 150 వార్డుల్లో పాతబస్తీ పవర్!

image

హైదరాబాద్ విభజన తర్వాత కూడా GHMC తన 150 వార్డుల బలాన్ని కాపాడుకుంది. అయితే, వెస్ట్రన్. ఈస్ట్రన్ జోన్లు విడిపోవడంతో ఇప్పుడున్న GHMCలో మజ్లిస్ (MIM) ఓటు బ్యాంక్ కాన్సంట్రేషన్ అమాంతం పెరిగింది. శంషాబాద్, రాజేంద్రనగర్ ఏరియాలు కలిసినా కోర్ సిటీలో మజ్లిస్ తిరుగులేని ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’గా మారింది. మేయర్ పీఠం దక్కాలంటే ఏ పార్టీకైనా మజ్లిస్ అండ ఉండాల్సిందే. విభజన తర్వాత మజ్లిస్ బలం మరింత పెరిగింది.

News February 17, 2026

26న నెల్లూరులో ఏం జరగనుంది..!

image

నెల్లూరు ఈనెల 26వ తేదీ స్పెషల్ డేగా మారనుంది. మాజీ సీఎంవ జగన్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు రానున్నారు. అదే రోజు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన స్రవంతి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఎన్నిక నామమాత్రమే కానుంది. అయినప్పటికీ అదే రోజు నెల్లూరుకు జగన్ రావడం ఆసక్తి రేపుతోంది.

News February 17, 2026

కోటిలింగాలకి కలెక్టర్.. పుష్కరాల ఏర్పాట్లపై పరిశీలన

image

వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోతో పాటు వివిధ శాఖల అధికారులు సందర్శించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ఆలయ పరిసరాల ఘాట్లు, భక్తులకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని ఆలయ అధికారులు కోరారు.