News January 6, 2025

వైఎస్ జగన్‌ను కలిసిన విజయవాడ మేయర్ 

image

నూతన సంవత్సర సందర్భంగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాల పరిస్థితిపై వారు జగన్‌తో చర్చించినట్లు సమాచారం. 

Similar News

News December 22, 2025

అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అట్రాసిటీ కేసుల పరిష్కార చర్యలు, దళితవాడల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు.

News December 22, 2025

టైమ్ బాండ్ ప్రకారం PGRS అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను టైమ్ బాండ్ ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై సమీక్షించిన కలెక్టర్ తక్షణమే క్లియర్ చేయాలన్నారు. ఈ-ఆఫీల్ ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా చురుగ్గా వ్యవహరించాలన్నారు.

News December 22, 2025

కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

image

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.