News February 18, 2025
వైఎస్ జగన్ దళిత ద్రోహి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడి కేసులో విజయవాడ సబ్ జైల్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అని చెప్పే నాయకుడు ఎస్సీల పైన దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.
Similar News
News February 20, 2025
గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత

అనంతపురం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
News February 20, 2025
ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులకు అస్వస్థత

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలోని ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న నలుగురు విద్యార్థినులను వెంటనే అనంతపురం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
News February 20, 2025
ATP: గుండెపోటుతో లారీలోనే డ్రైవర్ మృతి

యాడికి మండలం వేములపాడు సమీపంలో లారీలో నిద్రిస్తున్న డ్రైవర్ నరసింహులు నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. యల్లనూరు మండలం గొడ్డుమర్రికి చెందిన నరసింహులు లారీలో గ్రానైట్ తీసుకొని కర్ణాటకకు బయలుదేరాడు. నిద్ర రావడంతో వేములపాడు సమీపంలో లారీ ఆపి క్యాబిన్‌లోనే నిద్రపోయాడు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.