News November 29, 2024

వైఎస్ జగన్ ప్రకటన పచ్చి అబద్ధం: మంత్రి సత్యకుమార్

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌ మొహంలో అధికారం లేదన్న నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామంటూ వైఎస్ జగన్ ప్రకటన చేయడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.

Similar News

News February 8, 2026

రేపు పీజీఆర్ఎస్ రద్దు: అనంత కలెక్టర్

image

ఈనెల 9న (సోమవారం) అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్వహించే మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడిల కాన్ఫరెన్స్ కారణంగా గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు గమనించాలి సూచించారు.

News February 8, 2026

నేడు అనంతలో చికెన్, మటన్ ధరలు ఇలా

image

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220, అనంతపురంలో రూ.200, స్కిన్ లెస్ రూ.210 గుంతకల్లులో రూ.200, స్కిన్లెస్ రూ.210 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇక చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు హర్షం వ్యక్తం చేశారు.

News February 8, 2026

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

image

జిల్లాలో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీపీఎస్సీ ఛైర్మన్ శశిధర్ తెలిపారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ ట్రెజరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు 4 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.