News April 6, 2025

వైఎస్‌ జగన్‌ రాప్తాడు పర్యటన ఖరారు

image

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించనున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.

Similar News

News April 6, 2025

HYD: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

image

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

News April 6, 2025

NZB: పండుగ పూట తీవ్ర విషాదం

image

బైక్ అదుపు తప్పి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన భీమ్‌గల్‌ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు బైక్‌పై మోర్తాడ్ నుంచి భీమ్‌గల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో జాగిర్యాల్ గ్రామ శివారులో రోడ్డుపై అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ముక్కుకి తీవ్రగాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2025

భీమ్‌గల్: సీతారాముల కళ్యాణంలో PCC చీఫ్

image

భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్ది రామన్నస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమార్ సతీమణితో కలిసి కళ్యాణ క్రతువుని కనులారా వీక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!