News March 18, 2025

వైకల్యాన్ని ఓడించి..ఉద్యోగం సాధించి..! అంతే గాక..

image

ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు జుక్కల్ మండలం మొహ్మదాబాద్ వాసి ముక్తబాయి. పుట్టుకతోనే అంధురాలు ఉన్నా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఇటీవల గ్రూప్ 4 కు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచర్ల రెసిడెన్షియల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అంతే గాక తన పించన్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతి పత్రం అందించి ఆదర్శంగా నిలిచారు.

Similar News

News March 18, 2025

విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

image

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

News March 18, 2025

వైసీపీకి షాక్: వైజాగ్ మేయర్‌పై అవిశ్వాసం?

image

AP: విశాఖ నగరపాలకసంస్థలోని వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు కాసేపట్లో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరనున్నారు. ఇందుకోసం వారు అమరావతి చేరుకున్నారు. వీరితో కలుపుకొని జీవీఎంసీలో కూటమి సభ్యుల బలం 75కు చేరనుంది. అనంతరం జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం GVMCలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

News March 18, 2025

తిరుగు ప్రయాణం మొదలు

image

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం గం.10.36ని.లకు ISS నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ సపరేట్ అయింది. దీంతో భూమ్మీదకు వారి ప్రయాణం ప్రారంభమైంది. రేపు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున గం.3:27కు ఫ్లోరిడా తీర జలాల్లో ల్యాండ్ కానుంది.

error: Content is protected !!