News December 27, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <
Similar News
News December 31, 2025
నెల్లూరు: దోచుకుంది రూ.23 కోట్లు.. రికవరీ రూ.1 కోటి

జిల్లాలో 2025లో సైబర్ క్రైమ్ పెరిగింది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రూ.23,57,97,426 దోచేశారు. చాలామంది ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో దోచేయగా, ఇతరత్రా విధానాల్లో పెద్ద ఎత్తున్న దోచుకున్నారు. 2025లో సైబర్ నేరగాళ్లు రూ.23.57 కోట్లు దోచుకోగా.. పోలీసులు కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ రికవరీ సాధించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రగతి కనబర్చలేదు.
News December 31, 2025
పాక్ కీలక బౌలర్‌కి గాయం.. WCకి డౌట్?

T20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు పెద్ద షాక్ తగిలే అవకాశాలున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది గాయపడ్డారు. మోకాలి గాయంతో BBL నుంచి తప్పుకున్నారు. ఆయన కోలుకొని WCలో ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో 2021-22 మధ్య మోకాలి సర్జరీ కారణంగా అఫ్రీది కొన్ని నెలలపాటు ఆటకు దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి గాయపడటం ఆ జట్టును కలవరపెడుతోంది. T20 WC ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది.
News December 31, 2025
ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపం – లక్షణాలు

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.


