News January 9, 2025

వైకుంఠ ఏకాదశి వేడుకలకు శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం ముస్తాబు

image

కదిరిలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వైకుంఠ ఏకాదశి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఈనెల 10న తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం ద్వారాలు తెరచి శుద్ధి వచనం, విశేష పూజ, మహా మంగళహారతి ఉంటుందని అర్చకులు తెలిపారు. అనంతరం 3.30 గంటల నుంచి ఉత్తర ద్వార ప్రవేశం భక్తులకు కల్పిస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 9, 2025

మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు

image

తిరుపతిలో తొక్కిసలాట కారణంగా మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ అనంతపురంలో జరిగే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. సినీ ప్రముఖులతోనే ఈవెంట్ యథాతథంగా కొనసాగనుంది.

News January 9, 2025

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

image

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబ దేవి తెలిపారు. అందులో ఎఫ్ఎన్‌వో 18, సానిటరీ అటెండర్, వాచ్‌మెన్ 11 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు ఈనెల 20వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 9, 2025

రాయదుర్గం కేటీఎస్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల ప్రతిభ

image

రాయదుర్గంలోని కేటీఎస్ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ ద్వితీయ ఏడాది చదువుతున్న యోగేశ్వరి, గోపాల్ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారిలో నిలిచారు. ఇటీవల 15 రోజుల పాటు ఉత్తర కాశీలోని హిమాలయ పర్వతారోహణకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 17 ఎన్సీసీ కమాండెంట్లకు చెందిన క్యాడెట్లు హాజరుకాగా ఏపీ తరఫున యోగేశ్వరి, గోపాల్ ఉండడం గమనార్హం. కళాశాల బృందం వారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు.