News December 22, 2025
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట: ఆనం

ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పది రోజుల్లోని 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు (సుమారు 90 శాతం) వారికే కేటాయించారు. ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయాల్లోనే తిరుమలకు రావాలని సూచించారు. AI టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, విస్తృత అన్నప్రసాదాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 25, 2025
టుడే టాప్ స్టోరీస్

*20లక్షల ఉద్యోగాల కల్పనకే మొదటి ప్రాధాన్యం: CM CBN
*రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ శిక్షణలో దేశంలోనే AP టాప్
*వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుంది: CM రేవంత్
*2028లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు: KTR
*ఆరావళి పర్వతాల మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం
*ISRO సరికొత్త చరిత్ర.. కక్ష్యలోకి 6,100కిలోల బరువైన బ్లూబర్డ్ శాటిలైట్
News December 25, 2025
సిరిసిల్ల: ధాన్యం కొనుగోలు కమీషన్ చెక్కుల పంపిణీ

జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023-24 సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 30 శాతం కమీషన్ రూ.1,90,73,487, అలాగే రబీ సీజన్లో 2023- 24లో 2,62,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 100 శాతం కమీషన్ రూ.7,86,91,920 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు.
News December 25, 2025
PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్‌ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.


