News August 28, 2025

వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

image

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం నరసాపురం మండలం తూర్పు తాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. పీహెచ్‌సీలోని మందులు, ల్యాబ్, స్టాప్ రూమును, పలు విభాగాలను తనిఖీ చేశారు. ఓపి రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టి పరిశీలించారు. హాస్పటల్‌కు వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలన్నారు

Similar News

News August 29, 2025

గణేశ్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: ఐజీ

image

గణేశ్ నిమజ్జన వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, పోలీసులు కృషి చేయాలని ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. నరసాపురంలో ఆయన మాట్లాడారు. ఊరేగింపులో కుల, మత, ప్రాంత లేదా రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు లేదా చర్యలు ఉండరాదని సూచించారు. నిమజ్జనం కేవలం భక్తిభావంతో మాత్రమే జరుపుకోవాలని ఆయన కోరారు.

News August 28, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.

News August 28, 2025

సముద్రపు నాచుతో అదనపు ఆదాయం: కలెక్టర్

image

సముద్రపు నాచు సాగు ద్వారా ఎస్‌హెచ్‌జీలు అదనపు ఆదాయం ఆర్జించడానికి తోడ్పాటునందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం నరసాపురం మండలం పెద్దమైనవానిలంక డిజిటల్ భవన్ నందు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ సహకారంతో ఎస్‌హెచ్‌జి మహిళలకు అందిస్తున్న సముద్రపునాచు సాగు శిక్షణా తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.