News April 10, 2025
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి: బాధితులు

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు తాండూరు ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వారి వివరాలిలా.. తాండూరు మం. గౌతపూర్‌కి చెందిన ఆశమ్మ పురిటినొప్పులతో తాండూరు MCHలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భంలో శిశువు గుండె కొట్టుకోవడం లేదని స్కానింగ్‌కు బయటకు పంపించారు. స్కానింగ్ చేసుకుని ఆసుపత్రికి రాగా గర్భంలోనే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
Similar News
News December 2, 2025
తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకం

తల్లీకొడుకూ, తండ్రీకూతుళ్ల బంధాల గురించే అందరూ ప్రస్తావిస్తారు. కానీ తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, అవగాహన, కూతురు పెరిగే క్రమంలో స్వేచ్ఛగా పంచుకున్న ఆలోచనలు, భావాలు, అనుభవాలతోపాటు హార్మోన్లు దీనికి కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. భావోద్వేగాల్ని నియంత్రించే మెదడు నిర్మాణం ఇద్దరిలో ఒకేలా ఉండటమూ ఈ బలమైన బంధానికి ఓ కారణమట.
News December 2, 2025
వరంగల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 124 కేసులు నమోదు

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 124 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలో 94, వెస్ట్ జోన్‌లో 6, ఈస్ట్ జోన్‌లో 2, సెంట్రల్ జోన్‌లో 22 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.


