News November 18, 2025
వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News November 18, 2025
ANU: థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం బిఈడి థర్డ్ సెమిస్టర్, పీజీ సైన్స్, ఆర్ట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్.ఎల్.బి పరీక్షలు ప్రారంభమయ్యాయి. థర్డ్ సెమిస్టర్ 22 పరీక్షా కేంద్రాల్లోను, ఎల్.ఎల్.బి గుంటూరులో మూడు పరీక్ష కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలు తీరును పరిశీలించారు.
News November 18, 2025
లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.
News November 18, 2025
GWL: గద్వాల ఖ్యాతి నిలిచేలా ప్రతిభ చాటాలి

జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో ప్రథమ స్థానం సాధించిన కళాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని గద్వాల జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాలభవన్‌లో వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరుకోవాలని అన్నారు.


