News April 15, 2025
వైద్య ఆరోగ్య సిబ్బంది అభినందించిన వనపర్తి కలెక్టర్

వనపర్తి జిల్లాలో మిషన్ మధుమేహ, వందరోజుల టీబీ సర్వే కార్యక్రమాలు విజయవంతం చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రశంసించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి అభినందన సభ నిర్వహించారు.వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
Similar News
News December 30, 2025
మామునూర్ ఎయిర్‌పోర్టుకు మార్చిలో శంకుస్థాపన!

వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టుకు మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ప్రధాని రానున్నారు. మహబూబాబాద్‌లోని రైల్వే పీవోహెచ్, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీతో పాటు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోపక్క శంకుస్థాపన చేసిన 9 నెలల్లోనే విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
News December 30, 2025
జిల్లాలో 2.35 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

కోనసీమ జిల్లాలో బుధవారం 26 రకాల పెన్షన్లను 2,35,153 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. వీరికి రూ.101.69 కోట్లను పంపిణీ చేస్తామన్నారు. 9,883 క్లస్టర్లకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసామన్నారు. ఈనెల 31న 90% పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని, అర్బన్ లో బ్యాంకుల నుంచి నిధులు విత్ డ్రా చేశారన్నారు.
News December 30, 2025
టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి రావాలి: టీటీడీ ఈవో

AP: వైకుంఠ ద్వారదర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మూడు రోజులు ఆన్‌లైన లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2న నేరుగా రావాలని విజ్ఞప్తి చేశారు. వారికి జనవరి 8 వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.


