News October 22, 2024
వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టినందుకు ధన్యవాదాలు: పవన్

మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టినందుకు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశప్రజలలో స్ఫూర్తి నింపేలా జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి మహనీయుడి పేరు మచిలీపట్నం వైద్య కళాశాలకు పెట్టడం హర్షణీయమన్నారు.
Similar News
News November 6, 2025
కృష్ణా జిల్లాలోకి రానున్న కైకలూరు నియోజకవర్గం

ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి రానుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మార్పుకై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు డివిజన్‌లో ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, మండలాలు గుడివాడ రెవిన్యూ డివిజన్ కిందకు రానున్నాయి.
News November 5, 2025
పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
News November 4, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.


