News September 12, 2025

వైద్య సేవల్లో తూర్పుగోదావరికి అగ్రస్థానం

image

స్వర్ణ ఆంధ్ర విజన్-2047 కార్యక్రమంలో వైద్య ఆరోగ్య విభాగంలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 92% పనితీరుతో ఏ+ రేటింగ్‌ సాధించిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు పూర్తి స్థాయిలో టీకాలు వేయడం, శిశు మరణాలు తగ్గించడంలో జిల్లా అద్భుతమైన కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ విజయం జిల్లాలోని వైద్య సిబ్బంది సమిష్టి కృషితో సాధ్యమైందని ఆయన అన్నారు.

Similar News

News September 12, 2025

రాజమండ్రి: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి

image

రాజమండ్రిలో 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడికి గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి కొవ్వూరుకు సైకిల్ ‌పై వస్తుండగా గామన్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయాలపాలైన అతడిని స్థానికులు అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా గురువారం రాత్రి మృతి చెందినట్లు సీఐ విశ్వం తెలిపారు.

News September 12, 2025

రాజమండ్రి: ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

అక్టోబర్ 2వ వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యం సేకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం రాజమండ్రిలో జరిగిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది గ్రేడ్ ‘ఏ’ రకానికి క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు.

News September 11, 2025

తూర్పులో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

image

తూర్పుగోదావరి జిల్లాలో డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు గత రాత్రి 462 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై, బహిరంగంగా మద్యం తాగుతున్న 140 మందిపై కేసులు నమోదు చేశారు. రికార్డులు లేని 42 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.