News February 7, 2025

వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

image

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.

Similar News

News February 7, 2025

‘లైలా’ ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్

image

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ఈనెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఇప్పటికే విశ్వక్‌తో పాటు ‘లైలా’ నిర్మాత చిరును కలిసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు.

News February 7, 2025

మేడారం భక్తులకు బ్యాటరీ ఆఫ్ టాప్స్

image

మేడారం మినీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో బ్యాటరీ ఆఫ్ టాప్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనం అనంతరం భక్తులు సమీపంలోని అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో వనభోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నల్లాలను, చేతిపంపులను సైతం ఏర్పాటు చేశారు. కాగా, నీటిని వృథా చేయొద్దని సూచించారు.

News February 7, 2025

DAY 5: కడప కలెక్టర్‌ను కలిసిన విద్యార్థులు

image

ప్రొద్దుటూరు మండలం గోపవరం పశు వైద్య కళాశాల విద్యార్థుల నిరసన ఐదో రోజుకు చేరింది. ఇవాళ వెటర్నరీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కలిసి తమ సమస్యలు తెలుపుకున్నారు. తమ డిమాండ్లను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వీలైనంత త్వరగా తమకు స్టైఫండ్ ఇప్పించాలని కోరారు. లేదంటే చలో అమరావతి నిర్వహిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

error: Content is protected !!