News December 26, 2024
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, నరసింహ యాగం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణ కార్యక్రమం వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News February 15, 2026
నెల్లూరు: ఆ ఊరిలో మద్యానికి నో ఎంట్రీ..!

నెల్లూరు రూరల్ పాత వెల్లంటి రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా పేరు పొందింది. 30 ఏళ్లుగా ఆ గ్రామంలోకి మద్యం అనుమతించడం లేదు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10వేలు జరిమానా విధిస్తారు. గ్రామ పరిసరాల్లో బెల్ట్ షాపు నిర్వహిస్తే వారిని గ్రామస్థులే పోలీసులకు అప్పగిస్తారు. 1994 నుంచి సీపీఎం అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఉన్నారు. ప్రస్తుత యువత పెద్దల కట్టుబాట్లను కొనసాగించడం విశేషం.
News February 15, 2026
నెల్లూరు: రూ.15 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత

మనుబోలు మండలం జాతీయ రహదారిపై కాగితాలు పూర్ క్రాస్ రోడ్ వద్ద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రూ.14.70 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి చెన్నై వెళ్తున్న లారీలో 700 బస్తాలు (35 టన్నులు) రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా నిఘా వేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పోలీసులకు అప్పగించారు.
News February 15, 2026
చంద్రబాబు బడ్జెట్ అంతా మోసం, అబద్ధాలు : కాకాణి

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషాదకరమని, ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందన్నారు. వైసీపీ హయాంలో ఐదు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆమోదయోగంగా ఉందన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం వెనకడుగు వేయకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమన్నారు.


