News September 7, 2025

వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం నిత్యకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని పూలమాలతో అద్భుతంగా అలంకరించి నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News September 7, 2025

ఎట్టకేలకు మణిపుర్‌కు ప్రధాని మోదీ?

image

ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న ఆయన అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. పీఎం పర్యటనకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపుర్ అల్లర్లు చెలరేగినప్పటి నుంచి మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. దీంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News September 7, 2025

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌పై మాజీ మేయర్ కన్ను!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల సంఖ్య కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతోంది. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తాను కూడా టికెట్ ఆశిస్తున్నారని నేరుగా చెబుతున్నారు. తనకు ఇక్కడ మంచి పరిచయాలు ఉన్నాయని, మేయర్‌గా పనిచేసిన అనుభవం కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.

News September 7, 2025

నడిగూడెం: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

నడిగూడెం మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన బానోతు సేవ్య(65) ఆదివారం ఉదయం ముకుందాపురంలో కూరగాయలు అమ్ముకొని తిరిగి ఇంటికి వెళుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని మనవడు సాయి భరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.