News March 18, 2025
వైభవంగా సీతారామచంద్ర స్వామి నిత్య కళ్యాణం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం నిత్య కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సందడి మధ్య శ్రీరాముడి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Similar News
News February 24, 2026
ఇంటర్ పరీక్షలకు 359 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 64 పరీక్ష కేంద్రాలలో జరిగినట్లు ఆర్ఐవో రమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,919లో 20,588 మంది హాజరు కాగా 331 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,900 గాను 1,872 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను సిసి కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామని ఆయన తెలిపారు.
News February 24, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు స్వయంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేలా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ షాపులను తాత్కాలికంగా మూసివేయించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
News February 24, 2026
మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ నేపథ్యం ఇదే!

కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ(62) CPI(మావోయిస్ట్) పార్టీలో సీనియర్ నేత. ఆయన PBM, CCM, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఇంటర్ చదివే సమయంలోనే RSUలో చేరి KNRజిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1978నాటి జగిత్యాల జైత్రయాత్రతో ప్రభావితమై పీపుల్స్ వార్ లోకి వెళ్లారు. ఈయన తండ్రి వెంకట నర్సయ్య. దేవ్‌జీ భార్య, RCM నేత సృజన 2020 గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.


