News January 7, 2026

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4,6,4,6

image

సౌతాఫ్రికా U-19తో మూడో వన్డేలో భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయారు. 7వ ఓవర్లో వరుసగా 4,6,4,6 బౌండరీలు బాదారు. ఈక్రమంలోనే అతడు 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం వైభవ్‌(56)తో పాటు ఆరోన్ జార్జ్(51) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 111 రన్స్ జోడించారు.

Similar News

News February 21, 2026

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

image

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.

News February 21, 2026

NABARDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>NABARD<<>> బ్యాంక్స్ మెడికల్ ఆఫీసర్(BMO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS, PG అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 70ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nabard.org

News February 21, 2026

మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

image

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.