News December 26, 2025

‘వైరల్ హెరిటేజ్’ అడ్డాగా హైదరాబాద్

image

HYD హిస్టరీని యూత్ డిజిటల్ దునియాలో కింగ్‌ను చేసింది. 2025 యూట్యూబ్ ట్రెండ్స్ ప్రకారం.. గోల్కొండ సన్‌రైజ్ సెల్ఫీలు, చార్మినార్ AR ఫిల్టర్లు నెలకు 5 లక్షల షేర్లతో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలూ పాత కోటల చుట్టూ సినిమాటిక్ రీల్స్ చేస్తూ మన వారసత్వాన్ని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. ‘హెరిటేజ్ వైబ్’‌కు SMలో క్రేజ్‌ ఎక్కువైంది. ‘Beautiful Views@Golconda, Charminar’ క్యాప్షన్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

Similar News

News December 27, 2025

కాంగ్రెస్ ఎంపీ పోస్ట్.. BJPకి బూస్ట్

image

కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్వానీ పాదాల దగ్గర మోదీ కూర్చొన్న ఓ పాత ఫొటోను షేర్ చేస్తూ.. కింద కూర్చొనే సామాన్య కార్యకర్త కూడా CM, PM అయ్యే అవకాశం BJP, RSSలో ఉంటుందన్నారు. దీంతో ఇది పరోక్షంగా రాహుల్ గాంధీకి చురక అంటూ పలువురు సొంతపార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. వివాదం ముదరడంతో తాను వ్యవస్థను మెచ్చుకున్నానని BJPని కాదని దిగ్విజయ్ వివరణ ఇచ్చారు.

News December 27, 2025

21ఏళ్లకే మున్సిపల్ ఛైర్మన్.. రికార్డు సృష్టించిన కేరళ యువతి

image

కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలా మున్సిపాలిటీలోని 15వ వార్డు నుంచి 21 ఏళ్ల దియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, తీవ్రమైన రాజకీయ చర్చల అనంతరం ఆమెను మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివిన దియా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నత చదువులు కొనసాగిస్తానని తెలిపారు.

News December 27, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <>బుక్ చేసుకోండి<<>>.