News February 25, 2026
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో Phd, PG, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://wii.gov.in/
Similar News
News February 25, 2026
వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

అమెరికా ఆంక్షలు ఎత్తేశాక వెనిజులా నుంచి ఇండియాకు ముడిచమురు దిగుమతులు మొదలయ్యాయి. ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను మోసుకెళ్లే సూపర్ సైజ్ ట్యాంకర్లు భారత తీరం వైపు కదులుతున్నాయని రాయిటర్స్ సంస్థ తెలిపింది. ఈ వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ల (VLCC) వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు వేగంగా డెలివరీలు జరుగుతాయని చెప్పింది. నిస్సోస్ కియా, నిస్సోస్ కైథ్నోస్, అర్జానా ట్యాంకర్లు రానున్నట్లు పేర్కొంది.
News February 25, 2026
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

AP: పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు పరీక్షల విభాగం కీలక సూచనలు చేసింది. నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడానికి FEB 26 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డులోని డేటా ఆధారంగానే UDISE+ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మార్చి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి.
News February 25, 2026
ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు: హైకోర్టులో హరీశ్ తరఫు లాయర్

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని BRS చీఫ్ KCR, హరీశ్ రావు, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించింది. PC ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని హరీశ్ తరఫు న్యాయవాది సుందరం కోర్టుకు నివేదించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం ఘోష్ నివేదిక చెల్లదని విన్నవించారు. కాగా విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. KCR తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు.


