News August 12, 2024
వైవీయూకు మెరుగైన ర్యాంకు

కడప వైవీయూ అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలు, పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్-2024లో వైవీయూకు 50 నుంచి 100 లోపు ర్యాంకులో నిలిచింది. పరిశోధన అభివృద్ధి, ప్లేస్‌మెంట్, ఔట్ రీచ్ అండ్ ఇన్ క్లూసివిటి, పీర్ పర్సెప్షన్ అంశాలను ప్రామాణికంగా తీసుకుని ర్యాంకు ఇచ్చారు.
Similar News
News July 6, 2025
వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PSలో ఫిర్యాదు చేసింది.