News October 1, 2024
వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్‌కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
Similar News
News July 6, 2025
కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.
News July 6, 2025
ఈనెల 7న కడపకు YS జగన్

ఈనెల 7వ తేదీ కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి YS జగన్ వస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. 7వ తేది మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 8న ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. మహానేత YS రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారని అన్నారు. అనంతరం పులివెందులకు మీదుగా బెంగళూరుకు చేరుకుంటారన్నారు.
News July 6, 2025
కడప: ‘రిమ్స్‌లో తనిఖీలు’

కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సమితి సభ్యురాలు పద్మావతి శనివారం పర్యటించారు. పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎన్ఐసీయూలో పుట్టిన బిడ్డల ఆరోగ్య విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల చికిత్సకు వచ్చే పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించి ఆర్టీసీ అధికారులు, విద్యాలయ అధ్యాపకులతో చర్చించారు.