News August 4, 2024
వైవీయూ పరిధిలో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం

వైవీయూ పరిధిలో డిగ్రీ కోర్సులలో చేరేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ప్రవేశాలు పొందాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజీల్లో వెబ్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందని, ఇది ఈనెల 5వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News September 15, 2025
కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బంది బదిలీ.!

కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 39 మందికి స్థాన చలనం కలిగించారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో 7మందికి అటాచ్మెంట్ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శనివారం కడప ఎస్పీతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.
News September 14, 2025
గండికోటకు అవార్డు

న్యూఢిల్లీలో ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు’ లభించింది. ‘భారతదేశపు గ్రాండ్ కేనియన్’గా ప్రసిద్ధి చెందిన గండికోటకు ICRT, భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్‌లో ఈ అవార్డు లభించింది.
News September 14, 2025
కడప: RIMS పూర్వ వైద్యాధికారులపై విచారణకు ఆదేశాలు

కడప RIMSలో గతంలో పనిచేసిన వైద్యాధికారులపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు సురేశ్వర రెడ్డి, జొన్న నగేశ్, షేక్ మహబూబ్ బాషా, సంజీవయ్య, సత్యనారాయణపై విచారణకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరావు, కడప ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డిలను విచారణాధికారులుగా నియామకం చేశారు.