News April 27, 2024

వైసీపీది రియల్ మేనిఫెస్టో: తమ్మినేని

image

ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో రియల్ మేనిఫెస్టో అని రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలను కష్టాల నుంచి బయటపడేసే విధంగా జగన్ మేనిఫెస్టో ఉందని, చంద్రబాబు మేనిఫెస్టో అంతా కాపీ పేస్ట్ మాదిరిగా ఉంటుందన్నారు.

Similar News

News September 11, 2025

నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

image

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.

News September 11, 2025

ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News September 11, 2025

నేపాల్‌లో తెలుగువారి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

image

నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.