News April 25, 2024
వైసీపీలో చేరిన అనీషా రెడ్డి దంపతులు

టీడీపీ పుంగనూరు మాజీ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ని వాళ్లు కలిశారు. అనీషా రెడ్డి దంపతులకు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అనీషా రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ పలమనేరు MLA అభ్యర్థి అమరనాథ రెడ్డికి శ్రీనాథ్ రెడ్డి సోదరుడు అవుతారు.
Similar News
News April 25, 2025
చిత్తూరు: DPOకు ఉత్తమ ప్రతిభా పురస్కారం

పన్నుల వసూళ్లలో గతేడాది చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన పన్నులు, పన్నేతర వసూళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24 కోట్లకు రూ.22 కోట్లు వసూలు చేసి 88%తో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా DPO సుధాకర్ రావు ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు.
News April 25, 2025
సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. YCP నేత మాధవరెడ్డిని గురువారం తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు CID DSP కొండయ్య నాయుడు తెలిపారు.
News April 25, 2025
సదుం ఇన్ఛార్జ్ తహశీల్దార్‌పై వేటు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సదుం ఇన్ఛార్జ్ MRO మారూఫ్ హుస్సేన్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు వీఆర్వో మహబూబ్ బాషాను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త MROను నియమించే వరకు ప్రస్తుతం డీటీగా ఉన్న కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.