News March 26, 2024

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

image

నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వైసీపీ గూటికి చేరారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామకోటయ్య 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి 5,143 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ అప్పారావుపై గెలిచారు.

Similar News

News February 16, 2026

బిల్ గేట్స్‌కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్‌కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.

News February 16, 2026

నేడు మచిలీపట్నంలో మీ కోసం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.