News October 2, 2025
వైసీపీలో మాజీ ఎంపీ ఆదాలకు కీలక పదవి

వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీలో కీలక పదవి దక్కింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయన చోటు దక్కింది. గత ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సేవల్ని పార్టీ వినియోగించుకోవాలని భావించడంతో ఆయన CEC లో చోటు దక్కింది. దీంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 2, 2025
నెల్లూరు: తగ్గనున్న విద్యుత్ చార్జీలు

ఎన్నికల వేళ విద్యుత్తు బిల్లులు పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకున్నారు. తాజాగా ట్రూ డౌన్ సమీక్షలో జిల్లా వినియోగదారులపై రూ.32 కోట్లు భారం తగ్గనుంది. జిల్లాలో 12,37,429 కనెక్షన్లు ఉండగా రోజుకు సుమారు 13 మిలియన్ యూనిట్లు వినియోగమవుతున్నాయి. గతంలో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేసిన చోట, ఇకపై 13 పైసలు తగ్గింపు లభించనుంది. నవంబరు బిల్లుల నుంచే అమలు జరగనుందని SE కే.రాఘవేంద్ర తెలిపారు.
News October 2, 2025
నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా మిథున్ రెడ్డి

నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా పీవీ మిథున్ రెడ్డి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే మిథున్ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి ఆయనకే అప్పగిస్తూ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.
News October 2, 2025
గాంధీ జయంతి రోజున పొదలకూరులో ఆగని జీవహింస

గాంధీ జయంతి (డ్రై-డే), దసరా రెండూ ఒకే రోజు రావడంతో గురువారం పొదలకూరు మాంస వ్యాపారులు ఈ రోజు డ్రై-డే అన్న సంగతే మర్చిపోయారు.. సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్-2 గాంధీ జయంతిని పురస్కరించుకొని మద్యం, జీవహింస నిషేదిస్తారు. ఆ దిశగా అధికారులు వ్యాపారులకు ముందస్తు సమాచారం అందిస్తారు. కానీ ఈ దఫా అవేమి జరిగినట్లు లేదు. దీనితో యథేచ్ఛగా మాంసం విక్రయాలు చేస్తున్నారు.