News December 25, 2024
వైసీపీ తటస్థంగా ఉంటుంది: విజయసాయిరెడ్డి
రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. తాము ఎన్డీఏ లేదా ఇండియా కూటమి పక్షం కాదని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ తటస్థంగా ఉంటుందన్నారు. 2027లో జమిలి ఎన్నికలకు పార్లమెంట్‌లో బిల్లు పెడతారని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. దీనిపై వేసిన జెపీసీలో తాను సభ్యుడిగా ఉన్నానన్నారు.
Similar News
News December 25, 2024
విశాఖ: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు జనవరి 4న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నేవీ కమోడర్ మోహన్ పరిశీలించారు. సీఎం సభాస్థలికి చేరుకునే దగ్గరనుంచి తిరుగు ప్రయాణం అయ్యేవరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్సీబీ మీదుగా ఆర్కే బీచ్‌కు చేరుకుంటారని తెలిపారు.
News December 25, 2024
విశాఖ: ‘యాక్షన్-ప్యాక్డ్ క్షణాలకు సిద్ధంగా ఉండండి’
ఆకాశమే హద్దుగా సంద్రంలో నావికాదళం చేసే యాక్షన్-ప్యాక్డ్ క్షణాలను తిలకించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేవీ అధికారులు పిలుపునిచ్చారు. విశాఖ ఆర్కే బీచ్‌లో జనవరి 4న(2025) సాయంత్రం 4 గంటలకు మెరైన్ కమాండోలు, NCC క్యాడెట్లు, నావల్ బ్యాండ్ అద్భుతమైన విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈనెల 28,29, జనవరి 2న రిహార్సల్స్ చేయనున్నట్లు వెల్లడించారు. >Share it
News December 25, 2024
ఆడారిని వద్దన్న TDP.. రమ్నన్న BJP..!
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ రాజకీయ జీవితం రోజుకో మలుపు తిరుగుతోంది. MLAగా విశాఖ వెస్ట్ నుంచి YCPనుంచి ఓడిపోయిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కూటమిప్రభుత్వం వచ్చాక డెయిరీలో అక్రమాలు జరిగాయని జిల్లా TDPనాయకుల ఆరోపణలతో స్పీకర్ విచారణకు ఆదేశించారు. అయితే TDPలో ఆయన చేరేందుకు ప్రయత్నించగా స్థానిక నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో BJPలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.