News February 25, 2025
వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ

విజయవాడలోని స్పా సెంటర్‌లో పోలీసులకు దొరికిన వైసీపీ నేత వడిత్యా శంకర్ నాయక్‌ను పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.
Similar News
News February 25, 2025
గిద్దలూరు: వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

గిద్దలూరులోని పీఆర్ కాలనీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాబడిన సమాచారం మేరకు అర్బన్ సీఐ సురేశ్ వ్యభిచార గృహంపై దాడికి దిగారు. ఇద్దరు విటులను, మహిళలను, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విటులకు కౌన్సిలింగ్ ఇచ్చి యువకులపై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు.
News February 25, 2025
పెట్రోల్ బంకుల్లో మోసాలు.. DGP హెచ్చరిక

AP: ఎలక్ట్రానిక్ చిప్‌లు టాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DGP హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
News February 25, 2025
HYD: పబ్‌లో యువతిపై ఎక్స్ లవర్ దాడి

జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పాతబస్తీకి చెందిన యువతి తన స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు ఆసిఫ్ జానీ అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితురాలిపై కూడా దాడి చేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.