News August 11, 2025
వైసీపీ నేత చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు జరగనున్న వాదనలు

లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ MLA చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరగనున్నాయి. విజయవాడ ACB కోర్టులో ఈ పిటిషన్‌పై న్యాయాధికారి రేపు విచారించనున్నారు. అటు ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న నవీన్ కృష్ణ, కుమార్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సైతం రేపు వాదనలు జరగనున్నట్లు సమాచారం వెలువడింది.
Similar News
News August 13, 2025
ఖమ్మం: నీకు మరణం లేదు మిత్రమా..!

అమ్మ జన్మనిస్తే.. అవయవదానం పునర్జన్మనిస్తుంది. అవయవదానంపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా కొందరు అపోహలు, అనుమానాలతో వెనకడుగు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో మాత్రం అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. కూసుమంచి(M)చేగొమ్మకి చెందిన మహేశ్ ఈ ఏడాది జనవరి 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మరణించారు. కుటుంబ సభ్యులు మహేశ్ అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం.
News August 13, 2025
కామారెడ్డి: ‘4 నెలల్లో 2,300 కేసుల పరిష్కారం’

ఇటీవల కొత్తగా ఏర్పడిన రాష్ట్ర సమాచార కమిషన్ గత నాలుగు నెలల్లో పెండింగ్‌లో ఉన్న 18,000 కేసులలో 2,300కు పైగా కేసులను పరిష్కరించిందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ మోహ్సినా పర్వీన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన RTI అవగాహన సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె RTI చట్టం అమలుపై అధికారులకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
News August 13, 2025
ఏపీలో అతి భారీ వర్షాలు.. సెలవులు ఇస్తారా?

AP: రాష్ట్రంలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా అతి భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు 2 రోజులు సెలవులిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.