News September 12, 2025

వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి

image

అనంతపురం జిల్లా వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 12, 2025

విజయవాడలో కరాటే జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 కరాటే జట్ల ఎంపికలు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని జిల్లా ఎస్‌జి‌ఎఫ్. కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని కరాటే గురువులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 12, 2025

అమరావతిలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్

image

భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ సౌకర్యం అమరావతిలో రానుంది. క్వాంటం వ్యాలీ “క్వాంటం క్రయోజెనిక్ కాంపోనెంట్స్” ప్రాజెక్ట్‌ను పొందనున్నట్లు తెలుస్తోంది. క్వాంటం వ్యాలీలో దీనిని అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ స్థాపించనుంది. దీని పెట్టుబడి సుమారు 200 కోట్లు అంచనా వేస్తున్నారు. 49.66 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రానున్నట్లు సమాచారం.

News September 12, 2025

అమరావతి ORR అప్డేట్

image

అమరావతి ORR అప్డేట్ వచ్చింది. 140 మీటర్ల వెడల్పుతో సవరించిన DPR ప్రతిపాదనలను రూ.25 వేల కోట్ల అంచనాతో MoRTH సాంకేతిక కమిటీకి పంపారు. ఐతే ఆమోదం పొందిన తర్వాత ఫైల్ PPP అంచనా కమిటీకి, చివరకు ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు తరలించబడింది. అమరావతి ORR పై రావడంతో ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని పెరిగింది.