News November 17, 2024
వైసీపీ నేత విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను విజయవాడ CID కోర్టు కొట్టివేసింది. శనివారం ఈ పిటిషన్ విచారణకు రాగా విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వవద్దని CID తరపున వాదిస్తోన్న న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విద్యాసాగర్ బెయిల్‌కై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Similar News
News November 17, 2024
వాడవల్లి: బాలిక పుస్తకాల సంచిలో నాగుపాము
ముదినేపల్లి మండలం వాడవల్లిలో బాలిక పుస్తకాల సంచిలో నుంచి పాము రావడంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. యథావిధిగా శనివారం పుస్తకాల సంచిని తగిలించుకుని పాఠశాలకు బయలుదేరింది. మార్గం మధ్యలో సంచిలో నుంచి శబ్దాలు రావడం గమనించిన స్నేహితురాలు చూడగా నాగుపాము కనిపించింది. దీంతో స్థానికులు దాన్ని చంపడంతో పెను ప్రమాదం తప్పింది.
News November 17, 2024
విజయవాడ: వైసీపీని వీడేందుకు సిద్ధమైన కీలక నేత.?
ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పోతిన మహేశ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం సెంట్రల్‌లో ఓటమిపాలైన వెలంపల్లి శ్రీనివాస్‌ను విజయవాడ పశ్చిమ ఇన్‌ఛార్జిగా వైసీపీ అధిష్ఠానం నియమించింది. దీంతో వైసీపీని వీడేందుకు మహేశ్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
News November 17, 2024
గుడివాడ మాజీ MLA కొడాలి నానిపై కేసు నమోదు
గుడివాడ మాజీ MLA కొడాలి నానిపై విశాఖపట్నంలోని 3టౌన్ పట్టణ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. AU న్యాయకళాశాల విద్యార్థిని అంజనిప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను దుర్భాషలాడారని, ఆ తిట్లను తాను భరించలేక పోయానని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై కేసు నమోదు చేశామని CI రమణయ్య చెప్పారు.