News July 18, 2024
వైసీపీ పాలనలో భారీగా భూ ఆక్రమణలు: యార్లగడ్డ
ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడ్డారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఆక్రమించిన భూముల విలువ రూ.35,576 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు, ఉచిత ఇసుక పేరుతో రూ.9,750 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
Similar News
News November 27, 2024
ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు.
News November 26, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సు 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సీటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.
News November 26, 2024
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు: APSDMA ఎండీ
కృష్ణా: నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఉమ్మడి కృష్ణాతో పాటుగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీవర్షాలు పడతాయని ఆయన హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు.