News April 12, 2025
వైసీపీ పీఎస్సీ సభ్యులుగా మాజీ మంత్రులు

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేశ్, వెల్లంపల్లి శ్రీనివాసరావుని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు జాబితా విడుదల చేశారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని పార్టీ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
మెదక్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ బదిలీ

మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ బదిలీ అయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జడ్జిల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జితేందర్ మెదక్ నుంచి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌కు 27వ అదనపు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మెదక్ సీనియర్ సివిల్ జడ్జిగా అర్చన రెడ్డి బదిలీపై రానున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
News April 18, 2025
కార్పొరేట్ కళాశాలల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం: సునీత

భూపాలపల్లి జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల నుంచి 2025-26 సంవత్సరానికి గాను యస్.సి/యస్.టి/బి.సి/ఇ.బి.సి/వికలాంగ/ మైనారిటీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంసెట్ శిక్షణ అందించేందుకు కార్పొరేట్ కళాశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి డి. సునీత తెలిపారు. ఈ విషయాన్ని ఆయా కళాశాలలు గమనించాలన్నారు.
News April 18, 2025
టేకుమట్ల: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టపూర్(వి) గ్రామానికి చెందిన పెండం సదానందం (51) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సదానందం కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.