News April 13, 2025

వైసీపీ పీఏసీ కమిటీలో కడప జిల్లా నాయకులకు చోటు

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కడప జిల్లాకు చెందిన నాయకులకు అధిష్ఠానం చోటు కల్పించింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలకు పీఏసీ కమిటీలో స్థానం కల్పిస్తూ  వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పీఏసీ కన్వీనర్‌గా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఉంటారు.

Similar News

News April 13, 2025

కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతోశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

News April 13, 2025

కడప జిల్లాలో గత ఐదేళ్ల ఇంటర్‌ ఫలితాలు ఇవే..

image

☛ 2021 అకడమిక్‌ ఇయర్‌లో కరోనా కారణంగా 100 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
☛ 2022లో ఇంటర్‌ ఫస్టియర్ 41 శాతం.. సెకండియర్ 50 శాతం ఉత్తీర్ణత
☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత
☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
☛ 2025లో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 75 శాతం ఉత్తీర్ణత
కరోనా సమయంలో తప్ప ప్రతి ఏడాది కడప జిల్లా ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతూ పోతోంది.

News April 13, 2025

వేంపల్లి: 10వ తరగతి బాలికపై అత్యాచారం

image

వేంపల్లి మండలంలోని పదో తరగతి బాలికపై ఫాజిల్ అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ‘ఇటీవల బాలికను వేంపల్లె గాంధీరోడ్డులో చికెన్ దుకాణంలో పనిచేసే ఫాజిల్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసును నమోదు చేశాం. అలాగే అతడికి సహకరించారని చికెన్ దుకాణం ఓనర్ ఆనంద్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సీఐ తెలిపారు.

error: Content is protected !!