News February 4, 2025
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం: బాలకృష్ణ

వైసీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వార్డులను అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించి స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారని అన్నారు.
Similar News
News March 13, 2025
PPM: ‘మార్చి 23 నాటికి గృహ నిర్మాణాల సర్వే పూర్తి చేయాలి’

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేను మార్చి 23 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిని కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేజ్ అప్ గ్రేడ్ విధిగా జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇనుము ధర తగ్గిందని, ఇసుక లభ్యంగా ఉందన్నారు. ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగాయని అన్నారు.
News March 13, 2025
అవయవ దానానికి ముందుకు రావాలి: కలెక్టర్

బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్‌లో వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి అమర్చారని గుర్తు చేశారు.
News March 13, 2025
యువతలో ఎఐ నైపుణ్యాకు మైక్రో సాఫ్ట్‌తో కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయస్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్‌తో ఎపి ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గురువారం విజయవాడ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు.