News August 23, 2025
వైసీపీ మాదిరిగా తప్పుడు పనులు చేయం: మంత్రి స్వామి

వైసీపీ నాయకుల మాదిరిగా తాము తప్పుడు పనులు చేయమని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామంటూ మంత్రి స్వామి అన్నారు. కొండేపిలో నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి స్వామి మాట్లాడారు. ఒక్కొక్క హామీని తాము నెరవేర్చుకుంటూ వస్తున్నామని, వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు.
Similar News
News August 24, 2025
ఎరుపెక్కిన ఒంగోలు

ఒంగోలులో తొలిసారిగా నిర్వహించిన సీపీఐ రాష్ట్ర మహాసభ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. 28వ రాష్ట్ర మహాసభకు ఒంగోలు వేదిక కావడంతో కొన్ని రోజులుగా జిల్లా సీపీఐ నాయకత్వం, మహాసభలను సక్సెస్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ర్యాలీతో మహాసభ సూపర్ సక్సెస్ అంటూ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. మొత్తం మీద ఒంగోలు నగరం ఎర్రజెండాలతో రెపరెపలాడింది.
News August 23, 2025
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: ఎస్పీ

జిల్లాలోని ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పలు పాఠశాలల యాజమాన్యాలతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే విద్యార్థులు ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే చట్టం తీసుకునే చర్యల గురించి యాజమాన్యాలు వివరించాలన్నారు.
News August 23, 2025
ప్రకాశం ప్రజలకు విద్యుత్ శాఖ SE కీలక సూచన!

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు శనివారం జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బిల్లులను ఫోన్ పే, డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.