News March 9, 2025

వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా కేఎల్ దేవి

image

వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా అనంతపురం నగరానికి చెందిన కేఎల్ దేవి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ కోసం కృషి చేస్తానని, మహిళా హక్కుల కోసం పోరాడతానని ఆమె పేర్కొన్నారు.

Similar News

News April 4, 2026

సీఎం పర్యటనపై ఎస్పీ కలెక్టర్ సమీక్ష

image

యాడికి మండలంలో అనంతపురంకలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సీఎం 6న యాడికి మండలంలో జలధార కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో హెలిపాడ్, మార్కెట్ యార్డ్, సీఎం జల హారతి నిర్వహించే పెండేకల్ జలాశయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటనలో ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News April 4, 2026

6న అనంతపురానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక

image

ఏప్రిల్ 6న అనంతపురం నగరానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నిర్వహించే 15వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో ఆయన హాజరుకానున్నట్లు వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శనరావు తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించి ఇప్పటికే యూనివర్సిటీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News April 3, 2026

నార్పలలో మత్తుమందు చల్లి దొంగతనం

image

నార్పలలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గూగూడు రోడ్డులో ఉన్న మల్లికార్జున డ్రిప్పుల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.500కు చిల్లర కావాలని అడిగి యజమానిపై మత్తుమందు చెల్లి రూ.45 వేలు దోచుకెళ్లాడు. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాగర్ షాపులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. త్వరలోనే దొంగను అదుపులోకి తీసుకొని బాధితుడికి న్యాయం చేస్తామని ఎస్ఐ తెలిపారు.