News October 6, 2025

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామగిరి వాసి

image

రామగిరి మండలంలోని శేషంపల్లికి చెందిన శంకరయ్య వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ఆదివారం అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసి గజమాలతో సత్కరించారు. తనకు రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనవంతుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Similar News

News October 6, 2025

రేవల్లిలో కలకలం.. అత్తను చంపిన కోడలు

image

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో అమానుషం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలు బోగురమ్మ తన వృద్ధురాలైన అత్త దొడ్డిపట్ల ఎల్లమ్మ (70)ను కొట్టి చంపింది. అనంతరం దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. ఆదివారం దహన సంస్కారాలు చేస్తుండగా మృతదేహం వద్ద దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఎస్ఐ రజిత తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

News October 6, 2025

కైకలూరులో అత్యధిక వర్షం

image

ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు. అత్యధికంగా కైకలూరు మండలంలో 38.2 mm వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా భీమడోలు మండలంలో 0.4 mm వర్షం కురిసింది. 10మండలాల్లో ఎటువంటి వాన పడలేదు. జిల్లాలో సరాసరిన 7.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

News October 6, 2025

VITMలో 12పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM) 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నిషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, PwDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://www.vismuseum.gov.in/