News April 24, 2025
వైసీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం:రోజా

విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
Similar News
News April 24, 2025
జఫర్‌ఘడ్: లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్, MLA

జఫర్‌ఘడ్ మండలంలోని రేగడి తండాలో సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష, MLA కడియం శ్రీహరి భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకమని, పేద ప్రజల కడుపు నింపేందుకే సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సన్న బియ్యం పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 24, 2025
హీరోయిన్ బేబీ బంప్(PHOTO)

ఇటీవల ప్రెగ్నెన్సీ ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బేబీ బంప్‌తో కనిపించారు. నిన్న రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కెమెరామెన్లు ఆమె ఫొటోలు తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. కాగా కియారా, సిద్ధార్థ్ 2023లో పెళ్లి చేసుకున్నారు.
News April 24, 2025
నేడు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళికు నివాళులర్పించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. తిరుపతి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు సాయంత్రం 6.15కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాండురంగపురం వెళ్లి చంద్రమౌళికి నివాళి అర్పిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి, శుక్రవారం ఉదయం 9.15 గంటలకు విమానంలో రాజమండ్రికి బయలుదేరుతారు.