News December 12, 2025
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

టాలీవుడ్ <<18541857>>నటులు<<>> వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కోర్టులకు కాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే?.. కాపీరైట్, IT, పర్సనాలిటీ రైట్స్ వంటి జాతీయ స్థాయి వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రంగా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, అనేక టెక్ దిగ్గజాలు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తాయి. ఢిల్లీ HC ఉత్తర్వులు దేశం మొత్తం వర్తిస్తాయని దీన్ని ఆశ్రయిస్తుంటారు.
Similar News
News December 13, 2025
19 అమావాస్యలు ఇలా చేస్తే…?

కూష్మాండ దీపాన్ని అమావాస్య/అష్టమి రోజు వెలిగించాలి. మొత్తం 19 అమావాస్యలు/19 అష్టములు ఈ దీపం వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజానంతరం ఎండు ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే గ్రహ వాస్తు పీడల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. జనాకర్షణ, ధనయోగం కోసం ఈ పరిహారాన్ని పాటిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని కాల భైరవుడిని స్మరిస్తూ సంకల్పం చెప్పుకొని ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారు.
News December 13, 2025
102 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 13, 2025
పెరగనున్న కార్ల ధరలు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బెంజ్ వచ్చే ఏడాది JAN 1 నుంచి కార్ల ధరలు పెంచనుంది. 1-2% మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని చెప్పలేదు. యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచాల్సి వస్తోందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయంతో పాటు లాజిస్టిక్ ఖర్చులూ అధికం అవడాన్ని కారణాలుగా తెలిపింది.


