News October 23, 2025

వ్యభిచారం.. కర్నూలుకు చెందిన ఏడుగురు అరెస్ట్

image

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 12లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న సెక్స్‌ రాకెట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (వెస్ట్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు, సెలూన్ వ్యాపారి మహమ్మద్ షరీఫ్‌, కర్నూలుకు చెందిన ఏడుగురు కస్టమర్లు, హోటల్ రిసెప్షనిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Similar News

News October 23, 2025

రేపే కటారి దంపతుల హత్య కేసు ఫైనల్ జడ్జిమెంట్

image

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ <<18079030>>హత్య కేసు<<>>లో శుక్రవారం తీర్పు వెలువడనుంది. 10 ఏళ్ళ పాటు ఈ కేసుపై విచారణ సాగింది. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అలర్లు జరగకుండా పోలీసులు కోర్టు వద్ద పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంచారు. గుంపులుగా చేరడం, తిరగడంపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. కోర్టు పరిసరాల్లో సిబ్బందికి తప్ప మరెవరికి అనునతి లేదని వారు స్పష్టం చేశారు.

News October 23, 2025

ఇంటర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్‌ఫండ్ ఫీజు వసూలు

image

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు రూ.220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున మొత్తం రూ.235 కలెక్ట్ చేయాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. వసూలు చేసిన మొత్తాన్ని ఈనెల 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించింది.

News October 23, 2025

కామారెడ్డి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలులో నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్ఐ లింబాద్రి తెలిపారు. మృతుడి జేబులో ఖమ్మం నుంచి లక్నో వరకు టికెట్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.