News March 23, 2025

వ్యభిచార గృహంపై దాడి.. తెనాలి నిర్వాహకురాలి అరెస్ట్

image

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Similar News

News March 24, 2025

తాడేపల్లి: మహిళ హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP

image

తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలనుకొండ వద్ద మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన ప్రాంతాన్ని ఆదివారం రాత్రి గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంచేయాలని, నేరస్థులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు ఎస్పీ వెంట ఉన్నారు. 

News March 24, 2025

గుంటూరు జిల్లా ఎస్పీ వార్నింగ్

image

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఓ ప్రకటనలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు.

News March 24, 2025

అమరావతి: న్యాయవాదులకు గుడ్ న్యూస్ 

image

న్యాయవాదుల డెత్ బెనిఫిట్‌ను ఆరు లక్షలకు పెంచుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం హైకోర్టులో జరిగిన కౌన్సిల్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ మొత్తం ఐదు లక్షల రూపాయలుగా ఉంది. అనారోగ్యానికి గురైన వారికి ఒకటిన్నర లక్ష ఇవ్వనున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ తీర్మానాలు అమల్లోకి వస్తాయి. ప్రమాదవశాత్తు మరణించిన వారికి పై మొత్తంతో సంబంధం లేకుండా మరో ఐదు లక్షలు ఇస్తారు.

error: Content is protected !!