News December 1, 2024
వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: CM

మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండుగ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్థాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ విజయేంద్ర బోయి, మధుసూదన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
MBNR: ప్రతి దరఖాస్తు పరిష్కరించుకునేలా చూడాలి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం 31,190మంది దరఖాస్తు చేసుకోగా ప్రతి ఒక్కరు పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆర్పిలకు సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఈ నెలాఖరు లోగా పరిష్కరించుకుంటే 25% రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని వారికి వివరించాలన్నారు.
News March 13, 2025
MBNR: క్రమబద్ధీకరించుకుని రాయితీ పొందండి: కలెక్టర్

అనధికార ప్లాట్లు లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని 31190 మంది దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకుని 25% రాయితీని పొందుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ముందుకు వచ్చిన దరఖాస్తుదారుడికి వెంటనే పరిష్కరించేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
News March 13, 2025
NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేసింది. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.